Header Banner

ముగిసిన సీఐడీ విచారణ.. సంచలన విషయాలు వెల్లడి.! వైసీపీ నుంచి రాజీనామా చేయడానికి కారణం ఇదే..

  Wed Mar 12, 2025 15:41        Politics

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaysai Reddy)ని మంగళగిరి సీఐడీ పోలీసులు (Mangalagiri CID police) విచారించారు. కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్‌ (Kakinada Port Private Limited) అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. వాటాలు ఏ విధంగా తీసుకున్నారు?, బలవంతంగా లాక్కున్నారా?, బలవంతంగా తీసుకుంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఎంతనే విషయాలను సాయిరెడ్డి నుంచి సీఐడీ అధికారులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఉదయం 11 నుంచి దాదాపు 3:30 గంటలపాటు సాయిరెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, కేవీ రావు ఫిర్యాదు మేరకు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, శ్రీధర్, అరబిందో రియాల్టీ ఇన్ఫ్రాపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. విచారణకు హాజరుకావాలంటూ సోమవారం నాడు ఆయనకు సీఐడీ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మాజీ ఎంపీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. "కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా సీఐడీ అధికారులు ప్రశ్నించారు. మెుదటగా కేవీ రావు మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. ముఖ పరిచయం, అలాగే ఏదైనా సోషల్ ఫంక్షన్లలో నమస్కారం అంటే నమస్కారం అని చెప్పడం తప్ప.. అతనికి, నాకూ ఏ విధమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ సంబంధాలు లేవని చెప్పా.

 

ఇది కూడా చదవండి: వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని వెల్లడి.. సాక్షుల మరణాల పట్ల ఆందోళన! ఎస్పీకి వినతిపత్రం అందించిన దస్తగిరి..

 

అరబిందో సంస్థ నుంచి కేవీ రావుకు దాదాపు రూ.500 కోట్లు బదిలీ అయిన విషయంపై ప్రశ్నించారు. ఆ విషయం నాకు సంబంధం లేదని, అసలు నిధులు బదిలీ అయిన సంగతి కూడా తెలియదని వివరించా. అరబిందో వ్యాపార విషయాల్లో నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశా. నా కుమార్తెను వారికివ్వడం తప్ప, అరబిందో సంస్థతో నాకు ఆర్థిక సంబంధాలు లేవు. విక్రాంత్ రెడ్డి గురించి అడిగితే సుబ్బారెడ్డి కుమారుడిగా తెలుసని చెప్పా. రూ.500 కోట్ల లావాదేవీలకు సంబంధించి విక్రాంత్ రెడ్డే చేశారని, చాలా మంది సాక్షులు చెప్పినట్లు సీఐడీ అధికారులు అడిగారు. జగన్ మోహన్ రెడ్డి కాపాడేందుకే మీరు, విక్రాంత్ రెడ్డి కలిసే నగదు బదిలీ చేశారా? అని ప్రశ్నించారు. ఈ డీల్ విషయం జగన్‍కు తెలియదని చెప్పా. అలాగే నాకూ ఎలాంటి సంబంధం లేదని సీఐడీ అధికారులకు మరోసారి స్పష్టం చేశా. నన్ను ఉద్దేశపూర్వకంగానే ఒక అధికారికి ఈ కేసులో ఇరికించారు. గతంలో ఏ-2గా ఉన్నా కాబట్టి ఈ కేసులోనూ ఏ-2గా చేర్చారు. కేవీ రావు ఆప్త మిత్రులతో మాట్లాడితే నా పేరు ఇరికించినట్లు చెప్పారు. రాజకీయ బ్రోకర్ కేవీ రావు. అతనంటే నాకు అసహ్యం. జగన్ మోహన్ రెడ్డికి నాకూ మధ్య ద్వితీయశ్రేణి నాయకులు గ్యాప్ తెచ్చారు. దీంతో నా మనసు విరిగిపోయింది. అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చా. విరిగిన మనసు అతకదు. అందుకే వైసీపీ నుంచి వెళ్లిపోయా. ఘర్‌ వాపసీ నా మనసులో లేదు. తిరిగి వైసీపీలో చేరే ఉద్దేశం లేదని" చెప్పారు.

 

ఇది కూడా చదవండి: వైసిపి మరో బిగ్ షాక్! కీలక నేతలు నోటీసులు… ఎన్ని కేసులు నమోదు ఆంటే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

 

నాకే సిగ్గుచేటుగా ఉంది.. బయటపడుతున్న రోజా అక్రమాల గుట్టు! ఆడుదాం ఆంధ్రా పై విచారణ..

 

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VijayasaiReddy #Politics #YSRCP #AndhraPradesh #GoodBye #JaganShock #AyodhyaRamireddy